Chiranjeevi - Chamanthi Puvva Puvva (From "Mugguru Monagallu") lyrics
Artist:
Chiranjeevi
album: Megastar Chiranjeevi Super Hit Dance
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సిరిమల్లె మాల సిగలో ముడిచేయ్నా
చెంగావి చీర సిగ్గే దోచేయ్నా
అడిగిందే చాలు గురుడా పెనవేయ్నా
కౌగిట్లో చేరి కళలే కలబోయనా
సుడిరేగుతుందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే
అరెరెరె గిచ్చనా గొల్లభామ ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమ
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సంపంగి మొగ్గ శృతిలో సవరించు
అందాల బొమ్మ ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలికించు
వయ్యారమంతా ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తోంటే
హత్తుకో అందగాడా మజాలే అందుకో చందురోడా
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ అందీవే పాల బుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా
Поcмотреть все песни артиста
Other albums by the artist