Chiranjeevi - Bhale Bhale Banjara lyrics
Artist:
Chiranjeevi
album: Mega Star Chiranjeevi
హే సింబా రింబా సింబా రింబా
సిరతా పులులా సిందాట
హే సింబా రింబా సింబా రింబా
సరదా పులుల సైయ్యాట
సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది రప్పాప
డప్పు మోత మోగింది రప్పాప
కాకులు దూరని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది రప్పాప
నేల వంత పాడింది రప్పాప
సీకటంతా సిల్లు పడి
ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా దండుకుందాం పదా
తలో చెయ్యారా
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచేరీలో రెచ్చీపోదాం రా
సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది
♪
షల్లలల్లా హేయ్ హేయ్ షల్లలల్లా
♪
హే కొక్కరికో కోడి కూత
ఈ పక్క రావొద్ధే
ఐత్తలక్క ఆడే పాడే
మా లెక్క నాపొద్దే
తద్దినదిన సుక్కలదాకా లెగిసి ఆడాలా
అద్దిరబన్నా ఆకాశకప్పు అదిరి పడాలా
అరసెయ్యి గీతకు సిక్కింది
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే దాన్నట్టా బొంగరమెయ్యాలా
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచ్చేరిలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా
♪
నేస్తమేగా చుట్టూ ఉన్నా
చెట్టైనా పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుంటా మిట్టయినా
అమ్మకు మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీబిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము
గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈడ కష్టం సుఖం రెండిటికి
మనమే అయినోళ్లు
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయ్ కచ్చేరీలో రెచ్చీపోదాం రా
Поcмотреть все песни артиста
Other albums by the artist