Chiranjeevi - Yamaho Nee lyrics
Artist:
Chiranjeevi
album: Mega Star Chiranjeevi
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని
మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటి ప్రాయం
యమహో నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టి
గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే ఒంటికి పెట్టి
తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
చీకటింట దీపమెట్టి, చీకుచింత పక్కానెట్టి
నిన్ను నాలో దాచిపెట్టి, నన్ను నీకు దోచిపెట్టి
పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
పెట్టేది మూడే ముళ్ళమ్మి, నువ్వు పుట్టింది నాకోసమమ్మి
ఇక నీ సొగసు, నా వయసు పేనుకొనే ప్రేమలలో
యమహో
నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పట్టె మంచమేసి పెట్టి, పాలు పెట్టి, పండు పెట్టి
పక్క మీద పూలు కొట్టి, పక్కా పక్కా నోళ్ళు పెట్టి
ఆకులో వక్క పెట్టి, సున్నాలెట్టి, చిలకా చుట్టి
ముద్దుగా నోట్లో పెట్టి, పరువాలన్ని పండపెట్టి
చీర గుట్టు సారే పెట్టి, సిగ్గులన్నీ ఆరబెట్టి
కళ్ళలోన వత్తులెట్టి, కౌగిలింత మాటు పెట్టి
ఒట్టే పెట్టి వచ్చేసాక మామ నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ
పెట్టెయ్యి సందె సీకట్లోన నను కట్టెయ్యి కౌగిలింతల్లోన
ఇక ఆ గొడవ, ఈ చొరవ ఆగవులే అలజడిలో
యమహో
నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
నమహో నీ ఝమ ఝమ వాటం
సుడి రేగింది ఎడా పెడా తాళం
పోజుల్లో నేను యముడంత వాడ్ని
మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
అల్లారు ముద్దుల్లో గాయం
విరబూసింది పువ్వంటి ప్రాయం
నీ యమ యమ అందం
చెలరేగింది ఎగా దిగా తాపం
Поcмотреть все песни артиста
Other albums by the artist