Chiranjeevi - Ramma Chilakamma lyrics
Artist:
Chiranjeevi
album: Mega Star Chiranjeevi
రామ్మా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల
బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాల
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
♪
గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవింద
ఆవలించు కుంటే నిద్దరవుతుందా
ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో
కృష్ణా మురారి వాయిస్తావో
చలి కోలాటమేదో అడిస్తావో
(अरे आलारे भैय्या बंसी बजाओ
अरे आंध्र कन्हैया हाथ मिलाओ)
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ
♪
ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో
పట్టువిడుపు వుంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల
పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
(अरे आयारे नचके आंध्रवाला
अरे गावोंरे विन्द्र चिन्द्र डब्ली डोला)
రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా
ముక్కు మీద తీపి గోపాలా
మూగ కళ్ళ తేనే దీపాల
గంగులీ సందులో గజ్జల గోల
బెంగాళీ చిందులో మిర్చి మసాల
అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాల
(अरे आलारे भैय्या बंसी बजाओ
अरे आंध्र कन्हैया हाथ मिलाओ
अरे आयारे नचके आंध्रवाला
अरे गावोंरे विन्द्र चिन्द्र डब्ली डोला)
Поcмотреть все песни артиста
Other albums by the artist