Kishore Kumar Hits

Chiranjeevi - Kotha Kothaga lyrics

Artist: Chiranjeevi

album: Golden Hits Of Sirivennela Seetharama Sastry


కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

నా కన్ను ముద్దాడితే
కన్నె కులుకాయే కనకాంబరం
నా చెంప సంపెంగలో
కెంపు రంగాయే తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో
ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగం ఇప్పించవా సోకు
ఉద్యాన వనమాలిగా
జీతం ఇయ్యనా లేత
వన్నెలే చెల్లించుకోనా
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

నీ నవ్వు ముద్దాడితే
మల్లెపువ్వాయే నా యవ్వనం
నాజుకు మందారమే ముళ్ళ
రోజాగమారే క్షణం
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మొగాడి కౌగిలి
మగువ పరువశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు
ఎండల్లో కరిగించుమా
తీగ మల్లికి నరాల
పందిరి అందించుకోనా
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది
కోటి తారలే పూల ఏరులై
కోటి తారలే పూల ఏరులై
నేల చేరగానే
కొత్త కొత్తగా ఉన్నది
స్వర్గమిక్కడే అన్నది

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists