ఆ పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా commercial ఆ దేవుడు జీవుడు భక్తులు అగరొత్తులు అన్నీ పక్కా commercial ఆ గురువులు శిష్యులు చదువులు చట్టబండలు అన్నీ పక్కా commercial ఆ... పక్కా పక్కా పక్కా commercial Air free-ah, no Fire free-ah, no నీరు free-ah no నువ్వు నిల్చున్న జానేడు జాగ Free-ah రా, no no no no ఏ పక్కా commercial జన్మించినా మరణించినా అవదా ఖర్చు జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు తప్పు తప్పు అంటావా అనకూడదు అంటావా ఎంత మొత్తుకొని చెబుతున్నా చెవి పెట్టను అంటావా విత్తానికుండే వైభవం మన జగత్తులో ఏముంటుందిరా పైకానికి లోకం బాంచన్ అంటూ సాష్టాంగపడుతూ ఉందిరా ఇంతికీ నువు సెప్పేది ఏంటన్నా పక్కా పక్కా పక్కా పక్కా commercial సుక్కా ముక్కా పక్కా అన్నీ commercial ఏ పక్కా commercial ♪ నోటే లేని ఓటుంటుందా పైసా లేకుంటే power ఉంటుందా దానం కానీ ధర్మం కానీ ఖర్చే లేకుండా అయిపోతుందా సగమపనిసా సనిదప మగరిస నిదపమని గమపనిసా దండంతో సరిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుందా హుండీకి అంతో ఇంతో rate-ye కట్టందే నీతులు రాసే పుస్తకమైనా ఉచితంగా ఇచ్చేస్తారా ఫీజివ్వందే స్వాములు సైతం Freeగా దీవించేస్తారా వ్యవహారాలన్నీ వ్యాపారాలేగా గీతోపదేశం ఇదే కదా అని స్మరిస్తూ తరిస్తూ విజయాలను పొందు పక్కా పక్కా పక్కా పక్కా commercial చుక్కా ముక్కా పక్కా అన్నీ commercial పక్కా commercial మంచోళ్ళనీ చెడ్డోళ్ళనీ తేడాలొద్దు అయినోళ్ళకి కానోళ్ళకీ ఒకటే పద్దు చిప్ప చేతిలో పెట్టే గొప్ప సంగతులు మనకొద్దు కోట్ల సొమ్ము కూడబెట్టు అది గొడ్డునైనా కొనిపెట్టు ఆ కళ్ళకేమో గంతలుంది అన్యాయమైనా చూడొద్ధంటూ అవకాశాలే ఎదురొచ్చాయంటే రెండు చేతుల్తో కొల్లగొట్టు పక్కా పక్కా పక్కా పక్కా commercial చుక్కా ముక్కా పక్కా అన్నీ commercial