Chiranjeevi - Priyathama lyrics
Artist:
Chiranjeevi
album: Hot Summer Cool Songs
మౌనమే మేఘమై గుండెలో చేరెనే
ప్రాణమే వానలా కంటిపై జారెనే
నాలోనే చాలానే ఊహించుకున్నానే
ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే
నీకేమో దూరంగా నాకే నే భారంగా
మారాక నేనేందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
♪
కాలం సెగలకు గతమంతా కరిగెనే
శూన్యం బరువుకి బతుకంతా విరిగెనే
ఏ కారణాన్నో ఏకాకినైనా
లోకాన్ని చూల్లేని మైకంలో మునిగానే
నీదాకా పోలేని పాదాన్ని దూషించా
నిన్నందుకోలేని ప్రాయాన్ని ద్వేషించా
నీ జంట కాలేని గొంతై నే ఘోషించా
నాతో నువ్ లేనందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
♪
నాలో నలిగిన ప్రతి
శ్వాస అడిగెనే
లోలో తొలిచిన ప్రతి
ధ్యాసా పలికెనే
నీతోడు లేని ఈ తోవలోని నేనింకా
జీవించి ఏం లాభం అన్నాయే
ఆకాశం నాకోసం ఆహ్వానం పంపిందో
ఈ సంద్రం నాతోటి
సావాసం కోరిందో
నన్నింకా ఈ నేల
మోసేలా లేదేమో
ఈ జన్మ ఇంకెందుకే
ప్రియతమా ప్రియతమా
నను నేనే బంధించానమ్మా
ప్రియతమా ప్రియతమా
నిన్నేమని నిందిస్తానమ్మా
Поcмотреть все песни артиста
Other albums by the artist