Chiranjeevi - Chukkallara, Part-2 (From "Apathbhandavudu") lyrics
Artist:
Chiranjeevi
album: Retro Telugu Hits Of Spb, Chitra & Chiru
చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండి మింటికి
జో జో లాలి
జో జో లాలి
జో జో లాలి
జో జో లాలి
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే
నిదురమ్మ ఎటు పోతివే
మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె
కునుకమ్మ ఇటు చేరవే
తననన తానన తననన తానన
నిదురమ్మ ఎటు పోతివే... ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే
జోల పాడవా వేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జో జో లాలి
జో జో లాలి
పట్టుపరుపులేల పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జో కొట్టునే
నారదాదులేల నాదబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడే అంతులేడియ్యాల
కోటితందనాల ఆనందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యాడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టితల్లికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జో జో జో లాలి
జో జో లాలి
చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి
Поcмотреть все песни артиста
Other albums by the artist