Kishore Kumar Hits

John Wesly B - Nasiyinchedi lyrics

Artist: John Wesly B

album: Talavanchaku Nestama


నశియించెడి లోకంలో వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
అది నాదంటూ ఇది నాదంటూ ఆనందం కోల్పోతూ
పరమార్ధమును గ్రహియించకనే గతియించిపోతావా
నశియించెడి లోకంలో వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం

కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా
క్రీస్తు దారిలో సాగి నిత్యరాజ్యమే చేరి
క్రీస్తు దారిలో సాగి నిత్యరాజ్యమే చేరి
వసియించు కలకాలం సత్యమైన లోకంలో
నశియించెడి లోకంలో వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం

నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో
ఇకనైన మేలుకొని, గ్రహియించు సత్యాన్ని
ఇకనైన మేలుకొని, గ్రహియించు సత్యాన్ని
యేసులోకి మళ్ళించు నీ జీవిత గమనాన్ని
నశియించెడి లోకంలో వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
మేలైనది చేపట్టి సాగించు నీ పయనం
అది నాదంటూ ఇది నాదంటూ ఆనందం కోల్పోతూ
పరమార్ధమును గ్రహియించకనే గతియించిపోతావా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists