John Wesly B - Sajeeva Sakshuluga lyrics
Artist:
John Wesly B
album: Talavanchaku Nestama
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు రాజా అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వఫలము అర్పింతుము
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వఫలము అర్పింతుము
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
♪
తల్లి గర్భమునందు మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మమ్ము నింపి
భువిని సమకూర్చినావు
తల్లి గర్భమునందు మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మమ్ము నింపి
భువిని సమకూర్చినావు
ఎగసిపడే అలలెన్నో
అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన నెమ్మదినిచ్చి బ్రతికించినావు
కృంగిపోము మేమెన్నడు ఓటమిరాదు మాకెన్నడు
కృంగిపోము మేమెన్నడు ఓటమిరాదు మాకెన్నడు
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
♪
ఉన్నత పిలుపుకు మమ్ము పిలిచిన నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా మహిమ పూర్ణుడా
ఉన్నత పిలుపుకు మమ్ము పిలిచిన నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా మహిమ పూర్ణుడా
జడివానలైనా, సుడిగాలులైనా కాడిని మోస్తూ సాగెదం
నిందలైనా, బాధలైనా ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు అలసట రాదు మాకెన్నడు
కలత చెందము మేమెన్నడు అలసట రాదు మాకెన్నడు
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వఫలము అర్పింతుము
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వఫలము అర్పింతుము
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
Поcмотреть все песни артиста
Other albums by the artist