Hosanna Ministries Official - Lemmu Tejarillumu lyrics
Artist:
Hosanna Ministries Official
album: Aaradhana Pallaki
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా

నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద

ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి

ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత

జీవకిరీటమునే పొందుటకే నను చేరదీసితివి
జీవకిరీటమునే పొందుటకే నను చేరదీసితివి
ఇదియే ధన్యత ఇదియే ధన్యత ఇదియే నా ధన్యత
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము

తేజోమయమైన షాలేము నగరులో నిత్యము నిను చూచి తరింతునే

ఇదియే దర్శనము - ఇదియే దర్శనము ఇదియే నా దర్శనము
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద
Поcмотреть все песни артиста
Other albums by the artist