Kishore Kumar Hits

Rajendra Prasad - Ye Kadhanu Ye Kanchiki lyrics

Artist: Rajendra Prasad

album: Anukoni Prayanam


ఏ కధను ఏ కంచికి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
ఏ కధను ఏ కంచికి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి
చెంపపై జారిపోయే చెలిమే
చుట్టూ చుట్టాలు లేకున్నా
నాకంటూ లోకాన ఏకైక చిరునామా
నువ్వే కదా
ఓహో పాలల్లో నీళ్ళల్లే
కలిసేగా ఉండేది
భాదైనా నవ్వైనా స్నేహమొక్కటే
ఏ కధను ఏ కంచికి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా

ప్రేమతో నన్నే ఇలా తాకిన
అమ్మే తనే కాదనేదెట్టా
ఏ కల ఇన్నాళ్ళిలా లేదులే
నమ్మేదెలా ఈ నిజానిట్టా
అర్థం కాని భాషలోన
రాసుకున్న జీవితాన్ని
అద్భుతంగా మార్చుతున్న
అందమైన తోడు తనే
వెంటరాదు ఏదీ నీతో
నమ్ముతావో లేదో నువ్వు
ఎంత గొప్పవాడివైనా
మన్నుపోసి కప్పేత్తారు
అంటూ నాకు ఎన్నో చెప్పి
చెప్పకుండానే వెళ్ళిపోయావా
ఏ కధను ఏ కంచికి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా
ఏ కధను ఏ కంచికి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ
గుండెల్లో భాదల్ని దాచేసి సాగాలిగా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists