Kishore Kumar Hits

Nagarjuna - Ardha Rathrilo High Way Rasthelo lyrics

Artist: Nagarjuna

album: Shanthi Kranthi


అర్ధరాత్రిలో highway రస్తాలో
నిలిచింది వాన నడిచి వచ్చింది జాణ
నిలిచింది వాన నడిచి వచ్చింది జాణ
కాలిదారుల్లో నీటి మడుగుల్లో
చందమామల్లె కన్నెభామ మెరిసింది
చందమామల్లె కన్నెభామ మెరిసింది
ముత్యాలనవ్వే మా బిచ్చం వేస్తావా
నువ్వే మా ముద్దు మృష్టాన్నాలేవొద్దు
దొంగలు మేమమ్మ మా సొత్తువు నీవమ్మా
చెలించు వడ్డీ గుప్చుప్ సాంబార్ బుడ్డి
రాత్రివేళ జారిపడ్డ జాబిలి తునకమ్మ
దాజుల మొలకమ్మ
గాజుల చిలకమ్మా

కవిరాయ ఓ కపిరాయ

కవిరాయ ఓ కపిరాయ
మెచ్చుకోకు నీ మచ్చమాయ
ఊరు కొత్త తీరు కొత్త దారి చూపించు
గోడుమాని తోడువచ్చి గూడు చూపించు
నా జన్మ వివరం తెలుసునా
నా వంశ చరితం తెలుపనా
కృష్ణమ్మా వొడికే వెలుగుని
శ్రీశైల గిరిపై వెన్నలని
బుద్ధభూమి నాకు పుట్టిల్లు
గాంధీనేలా నాకు నట్టిల్లు

బుద్ధుడొచ్చిన బుద్ధి చెప్పినా
రాత మారదే గుండె కోత తీరదే
సీతజన్మకే లంక బాధ తప్పదే
గాంధీ వొచ్చిన బోధ చేసినా
రాత మారదే ఈడు బాధ తీరదే
ఈడు పాపకే బాపు వీడిపోయెనే
ఇల్లగాలికే ఓ హింస పుట్టేనే
వాలు చూపుకే ఓ వంత రేగెనే
చూడడానికా ఈ శిల్పం ఉన్నది
తాకడానికే నీ రూపం ఉన్నది
ముళ్ళరోజ ముట్టుకుంటే గిల్లకే తప్పదులే
నీ అల్లరి చల్లదులే
మా కోరిక ఆగదులే

నటరాజ రక్షించ రావా

నటరాజ రక్షించ రావా
విటులంతా భక్షించే వేళా
ఆడపిల్ల కొంగులాగే కొడెగాళ్ళకి

మూడో కన్నో తెరిచావంటే మూడుతుందిలే
నటరాజు గిరిజ సఖుడేలే
ఎవడైనా వనితా భటుడేలే
నీ తల్లి హృదయం తెలుసునా
ఈ చెల్లి వివరం తెలుపనా
కన్నె పిల్ల నీడ మేములే
నాకు నీడ మీరు కాదులే

అర్ధరాత్రిలో highway రస్తాలో
ఆడపిల్లవీ నీ సంగతేమిటి
అర్ధరాత్రిలో ఇంత ఊరిలో
ఆడపిల్లకి ఇంకెక్కడా గతి
కేకలెందుకే నీ case-u చెప్పక
లాటి తిప్పుతూ సయ్యాటలాడక
ఆపవే లయ ఇది strict-u area
ఏమి area పోలి మలేరియా
కన్నె శీలం కాయలేని కాలిఫోర్నియా
నీ గొప్పే చాలయ్య
నీ డప్పే ఆపాయ్య

నడి రేత్రి స్వాతంత్రమివ్వగా
నడి వీధి భాగోతం ఆయేనా
అర్ధరాత్రి తందానాల స్వేచ్ఛ వొద్దు రా
అమృతాన్ని నేలపాలు చేసుకోకురా
వేదాంత ఘోష ఒక వంక
ఈ కాంత ఘోష ఒక వంక
మనుధర్మ శాస్త్రం మరిచారా
మన ధర్మం ఇపుడు విడిచారా
బుద్ధభూమి మాకు పుట్టిల్లు
గాంధీనేలా మాకు నట్టిల్లు
(పావురాయి చేజారిపోయింది
సద్దన్నం సల్లారి పొయ్యింది
కాకులాషి కాకుల్లా గొంతెండి పొయ్యింది
లోకుల్లా మా లోకంలో మాటుంది పొయ్యింది)
ఏ ఏటిలోది ఆ నీరే
ఏ ప్రాప్తమైన ఈ తీరే
కతికేటి మెతుకే నీదైతే
విధి చక్కుతుంది నీ పేరే
(వచ్చాయండి బుద్ధి జ్ఞానాలు
మన్నించండి మీకే టాటాలు)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists