ఓం
ఓం
ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
♪
అదిగో అదిగో భద్రగిరి
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకీ రాయనికథగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపాదామృత వాగ్గేయ స్వరసంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
(అదిగో అదిగో భద్రగిరి
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
రామ్ రామ్ రామ్ రామ్)
రామనామ జీవన నిర్నిద్రుడు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
♪
(సాస సాని దని సానిదామ గమ పాదనీ దామపా)
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్ధిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆ దర్శనమే కోరెనప్పుడు
♪
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖచక్రములు అటుఇటు కాగా
ధనుర్బాణములు తనువైపోగా
సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్లీ మలచి శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే భాగ్యమునిమ్మని కోరె భద్రుడు
♪
వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే
అదిగో అదిగో భద్రగిరి
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
Поcмотреть все песни артиста
Other albums by the artist