Nagarjuna - Ekshvaku Kula lyrics
Artist:
Nagarjuna
album: Sri Ramadasu
ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామంచంద్రా
లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల మొహరీలు రామచంద్రా
సీతమ్మకూ చేయిస్తినీ చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకానికీ బట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికితురాయి నీకు పోలుపుగా జేయిస్తిని రామచంద్రా
నీ తండ్రి దశరథ మహరాజు పంపెనా
లేక మీ మామ జనక మహరాజు పెట్టెనా
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా
ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా
Поcмотреть все песни артиста
Other albums by the artist