Nagarjuna - Naatho Vasthavaa lyrics
Artist:
Nagarjuna
album: Mass
హోయ్, నాతో వస్తావా, నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే, నీతో వస్తాలే
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే
నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా
ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే
ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా
హోయ్, गोरी गोरी गोरी गोरी గోలుకొండ प्यारी రావే నా సంబరాల సుందరి
హేయ్, चोरी चोरी चोरी चोरी చెయ్యిజారకోరి నీదే ఈ సోయగాల छोकरी
మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు
ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు
హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు
నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు
రేయిపగలు నా కంటిపాపలో నిండినావే నువ్వే
అణువు అణువు నీ తీపితపనతో తడిసిపోయే కనులే
హేయ్, గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ
హేయ్, రంగులీను ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ
హాయ్, నాతో వస్తావా, నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
అరెరే అరెరే తేనూరే పెదవి
మెలికే పడని నను నీలో పొదివి
పడితే నదిలా వరదయ్యే నడుము
పరదా విడనీ నీదయ్యే క్షణము
పరువమెందుకీ పరుగులాగవే పరుపు చేరు వరకూ
పడుచువయసులో అంచుపైటలే బరువులాయె నాకు
హోయ్, చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి
హోయ్, చెంగులోన దూరి దూరి గింగురెత్తి పోరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ
హాయ్, నాతో వస్తావా, నాతో వస్తావా
నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే, నీతో వస్తాలే
నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే
Поcмотреть все песни артиста
Other albums by the artist