Nagarjuna - Premalekha Rasenu lyrics
Artist:
Nagarjuna
album: Ninne Premista
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుస గుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరు నవ్వుల్లా నిన్ను రమ్మని
ఎదురుచుసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం
(ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం)
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
♪
కనులకు తెలియని ఇదివరకెరుగని చెలిమే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదకెను ఆమెను చేరాలని
యద సడి నాతోనె చెప్పకపోదా ప్రియసఖి పేరేమెరిటో
కదిలే కాలాలు తెలుపక పోవా చిరునామా ఏమిటో
చెలికోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం
(ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం)
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
♪
కవితలు చాలని సరిగమలెరుగని ప్రేమే నాపాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగి చూడనా ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే ప్రేమకు స్వాగతం
(ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం)
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుస గుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరు నవ్వుల్లా నిన్ను రమ్మని
ఎదురుచుసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం
(ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం)
(ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం)
Поcмотреть все песни артиста
Other albums by the artist