శ్రీవారు దొరగారు అయ్యగోరు ఏంటండీ మీ పేరు ఆయ్ చెప్పండీ వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదు ముద్దుగ అంటాలెండి మీ సరదా తీరేలా డార్లింగ్ గారు డార్లింగ్ గారు గారెందుకు బంగారు వింటుంటే కంగారూ గారంగ శృంగారంగా డార్లింగ్ అంటే చాలు డార్లింగ్ కీ లింగు లిటుకు లింకులు పెడితే బోరు ఓ మై డియరూ ఓ మై డియరూ ఊఁ నరనరాల్లోన చలిజ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చేయనే ఊఁ కలవరంలోన చలివరం కోరు నసతెలుస్తున్నది మందీయనా కనుక్కోవ కుశలం కాస్తైన అతుక్కోను సమయం చూస్తున్న నచ్చావే నాటీ నాంచారు ఓ మై డియరూ శ్రీవారు దొరగారు మేరీ శ్రీమతి గారు ఓ యమతమాషాల తమ తతంగాల బుసబరించేదెలా ఇంటాయనో ఓయ్ ఊఁ మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగ చల్లారునో నిగారాల సొగసులు ఇవ్వాల ఇలాంటేల అనుమతి కావాల తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ అబ్బా ఇంకానా ప్యారి పెళ్ళాంగారు మేరీ శ్రీమతి గారు సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ చిలకల్లే చిలిపిగ నన్ను పిలావలే ప్రియురాల ఓ మై డియరూ మా ఊళ్లో ఆడాళ్ళూ ఏమయ్యె అంటారు ఊహూఁ ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు ఆఁ డార్లింగ్ కు గారొద్దంటే తీసేస్తాలే సారూ ఎస్ ఎస్ ఓ మై డియరూ హాయ్ హాయ్ డియరూ రా మై డియరూ ఎస్ ఎస్ డియరూ సాహిత్యం: సిరివెన్నెల; సీతారామరాజు: ఎమ్.ఎమ్.కీరవాణి