Nandamuri Balakrishna - Adigaa Adigaa lyrics
Artist:
Nandamuri Balakrishna
album: Akhanda
అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
చిన్ననవ్వే రువ్వి మార్చేశావే నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టి కట్టేశావే నన్నేమో సన్నాయిగా
కదిలే కలలే కళ్ళ వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
తకతై తక తకధిమి తక
తకతై తక తకధిమి తక
గమమ మపప గస్స
గమమ మపప గస్స
సా గరిసని నిసనిద పమపా
పనినిద పమపా పసనిద పమపా
పదని పదని పదనిసని గరిని
సాగరి గమప గరిని
నిసగరి సనిదప మగరిగ మదపా
నిగపమపా
♪
సరిలేని సమరాల సరిపోని సమయాలు
తొలిసారి చూశాను నీతో
విడిపోని విరహాలు, విడలేని కలహాలు
తెలిపాయి నీ ప్రేమ నాతో
ఎల్లలేవీ లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా
వెళ్ళలేనే నేనే నిన్నేదాటి నూరేళ్ళ నా సూత్రమా
కనని వినని సుప్రభాతాల సావాసమా
సెలవే కోరని సిగ్గులోగిళ్ల శ్రీమంతమా
అడిగా అడిగా పంచప్రాణాలు నీ వాడిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
♪
సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు
కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు, మనసేమో బంగారు
సరిపోవు నూరేళ్లు నీతో
ఇన్నినాళ్ళూ లేనేలేదే నాలో నాకింత సంతోషమే
మళ్ళీజన్మే ఉంటే కావాలంట నీచెంత ఏకాంతమే
కదిలే కలలే కళ్ళ వాకిళ్ళలో కొత్తగా
కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా అడిగా పంచప్రాణాలు నీ రాణిగా
జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
Поcмотреть все песни артиста
Other albums by the artist