సీతారామ చరితం
శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం
శ్రవణం పాపహరణం
ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం
చతుర్వేదవినుతంలో కవిదితం
ఆదికవి వాల్మీకి రచితం
సీతారామచరితం
కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
కోదండపాణి ఆ దండకారణ్యమున కొలువుండె భార్యతో నిండుగా
అండదండగ తమ్ముడుండగ
కడలితల్లికి కనుల పండుగ
♪
సుందర రాముని మోహించె రావణ సోదరి శూర్పణఖ
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి
అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి
దారుణముగ మాయ చేసె రావణుడు
మాయలేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు
అదను చూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి
కరకు గుండె రాకాసుల కాపలాగ వుంచి
♪
శోక జలధి తానైనది వైదేహి
ఆ శోక జలధిలో మునిగె దాశరధి
సీతా సీతా (సీతా)
సీతా సీతా అని సీతకి వినిపించేలా
రోదసి కంపించేలా
రోదించె సీతాపతి
♪
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీతకెందుకీ విషాదం
రామునికేలా వియోగం
కమలనయనములు మునిగె పొంగే కన్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో
♪
వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చిసీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చి
♪
వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
బాణవేగమున రామభద్రుడా రావణు తల పడకొట్టెరా
ముదమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెరా
అంత బాధ పడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర జగమంత చూడగా
వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష
♪
ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్నిపరీక్ష
దశరథుని కోడలికా ధర్మపరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా
జానకి దేహానికా
సూర్యుని వంశానికా
ఈ లోకం నోటికా
ఎవ్వరికీ పరిక్ష ఎందుకు ఈ పరీక్ష, శ్రీరామా
♪
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి
అగ్నిహొత్రుడే పలికె దిక్కులు మార్మోగగా
సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు
ఆ జానకితో అయోధ్య కేగెను సకల ధర్మసందీపుడు, సీతాసమేత శ్రీరాముడు
Поcмотреть все песни артиста
Other albums by the artist