న మాతా పితా నైవ బంధుర్ణమిత్ర నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ ♪ న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం చిదానంద రూపం శివోహం శివోహం ♪ తల్లి ఏది తండ్రి ఏడి అడ్డుతగిలే బంధమేది మమతలేవి మాయాలేవి మనసుపొరల మసకలేవి నీ ఇల్లు నీ వాళ్ళు నీదంటూ ఏ చింత సుంతైనా లేని ఈ నేలపై నడయాడు ఋషివో కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాశించు మనిషివో ఋషివో రాజర్షివో ఎవరివో నీవెవరివో నీవెవరివో ఓ ఎవరివో న మంత్రో న తీర్ధం న యజ్ఞ న వేదం న ధర్మో న చార్ధో న మోక్షం న కామం న మృత్యుర్ణశంక నమే జాతి బేదం చిదానంద రూపం శివోహం శివోహం ♪ జాగృతములో జాగు ఏది రాత్రి ఏది పగలు ఏది కార్యదీక్షా బద్ధుడవుగా అలుపు ఏది దిగులు ఏది ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణ యాగాన్ని ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగి కథనరంగాన కర్మయోగి అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం ♪ న తేజో న వాయుర్ణ భూరిర్ణవ్యోమం చిదానంద రూపం శివోహం శివోహం నిర్వసన వాసాన్నసంక్షేమ స్వాప్నికుడు ఇతడు నిష్క్రియా ప్రఛ్చన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు మహానాయకుడు ఇతడు (మహానాయకుడు ఇతడు) ♪ న మాతా పితా నైవ బంధుర్ణమిత్ర నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం చిదానంద రూపం శివోహం శివోహం న మంత్రో న తీర్ధం న యజ్ఞ న వేదం న ధర్మో న చార్ధో న మోక్షం న కామం న మృత్యుర్ణశంక నమే జాతి బేదం చిదానంద రూపం శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం న తేజో న వాయుర్ణ భూరిర్ణవ్యోమం చిదానంద రూపం శివోహం శివోహం