Kishore Kumar Hits

Kaarthi - Vennela Chetha Patti lyrics

Artist: Kaarthi

album: Naa Peru Shiva


వెన్నెల చేతపట్టి తేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఆటలాడుదాం పాటపాడుదాం చంద్రవంక పైన
వెన్నెల చేతపట్టి తేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఆటలాడుదాం పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
Welcome కడదాం చెలిమితో పై మెట్లు
Welcome కడదాం చెలిమితో పై మెట్లు
వెన్నెల చేతపట్టి తేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఆటలాడుదాం పాటపాడుదాం చంద్రవంక పైన

రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన యద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం
Welcome కడదాం చెలిమితో పై మెట్లు
Welcome కడదాం చెలిమితో పై మెట్లు
వెన్నెల చేతపట్టి తేనా
పిండి బొమ్మ చేసి ఈనా
ఆటలాడుదాం పాటపాడుదాం చంద్రవంక పైన

కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే అయినా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని
(Welcome కడదాం చెలిమితో పై మెట్లు
Welcome కడదాం చెలిమితో పై మెట్లు)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists