తెల్లారే ఊరంతా తయ్యారే
ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే
తగ్గేదే లేదంటే ప్రతివాడే
మరుపే రానీ ఊరె గుంటూరే
అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే
ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే...
బేరం సారం సాగే దారుల్లోన
నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాకా
గాలం ఏసి పట్నం బజారు పిలిసే
ఏ పులిహోర దోస బ్రాడీపేట
బిర్యానికైతే సుబ్బాని మామ
వంకాయ బజ్జి ఆరో లైను
గోంగూర సికెను బృందావనము
మసాల ముంతా సంగడి గుంట
మాల్ పూరి కొత్తపేట
చిట్టి ఇడ్లీ లక్ష్మీపురము
అరె చెక్క పకోడీ మూడొంతెనలు
గుటకే పడక కడుపే తిడితే
సబ్జా గింజల సోడా బుస్సన్దే
పొడికారం నెయ్యేసి పెడుతుంటే
పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంట ఏదైనా
లేదన్నా మాటంటూ రాదంటా
సరదా పడితే పోదాం గుంటూరే...
Поcмотреть все песни артиста
Other albums by the artist