నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ ♪ ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ రాజు పేద బేధమంటు లేదు దీనికి బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ ♪ ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం తానే లేకుంటే బతుకే వనవాసం ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ నిండు గోదారి కదా ఈ ప్రేమ అందరికీ బంధువుగా ఈ ప్రేమ రెండు హృదయాల కథే ఈ ప్రేమ పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ