ధీమాగా ఎగిరెళ్ళాం నేలమ్మా క్షేమంగా దిగివచ్చామం చూడమ్మా సులువుగ నమ్మలేవు గానీ అడగవె చందమామని జరిగిన సాహసాన్ని చూసి ఉంటె సాక్ష్యమిమ్మని దాయి దాయని చేయి చాచినా జాబిల్లి రాలేదుగా ఇలకొదిగి సరె పోనీ అని మనమే వెళదాం పదా అని రాదారి వేసాము ఆ రెంటికి మెరుపుల హారాలే మా మెళ్ళోన వేసి పిలిచి మిల మిలమని మురిసెను గగనం ఆకశానికి సాగరానికి ఈ దూరం ఏనాటికీ కరగనిదా అన్న ఆలోచనే ఎదలో ఎగసే అలైనదా రోదసికి సేతువుగ మారును కదా చెదరని నమ్మకమే నేస్తమయి పయనమైతే కనులెదురుగ కల నిలుచునుగా