Kishore Kumar Hits

Pavan Kalyan - Ee Manase Se Se lyrics

Artist: Pavan Kalyan

album: Tholiprema


ఈ మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
నా మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
పరుగెడుతోంది నీకేసి, వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే
ఈ మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
నా మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)

ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతో కలవరించెనా
వెనకనె తిరుగుతూ చెలిజత విడువదు
దొరికిన వరమది కుదురుగ నిలువదు
ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే
ఈ మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
నా మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)

నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశే
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశే
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
ఈ మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
నా మనసే (సెయ్ సెయ్ సెయ్ సెయ్)
పరుగెడుతోంది నీకేసి, వినమంటోంది తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists