గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
ఓ... ఓ... ఓ... గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ... ప్రేమ... ప్రేమ... ప్రేమ... ఆ ... ఆ ... ఆ...
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నీ కనులేవో కలలు అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో వెలిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేద నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞపకాన్నై నిన్ను పిలువా
పగడాల మంచుపొరలో
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవీ
నా ఊపిరిలో ఎగసి చెదరి కుదుట పడినవీ
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మనసన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణలే అక్షరాలై శృతిలేని ప్రేమ కధగా మిగిలిపోనీ
ఆ... హా... ఆ... హా...
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
ఓ... ఓ... ఓ... గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ... ప్రేమ... ప్రేమ... ప్రేమ... ఆ ... ఆ ... ఆ... ప్రేమ ప్రేమ హ్...
Поcмотреть все песни артиста
Other albums by the artist