ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం శరణం నీ చరణం - శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో... నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం శరణం నీ చరణం - శరణం నీ చరణం శరణం నీ చరణం - శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము నీ పాదముల చెంత చేరి. - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి... - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము శరణం నీ చరణం - శరణం నీ చరణం శరణం నీ చరణం - శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం