కోలు కోలో కోలోయమ్మ కొమ్మ చివరన పూలుబూసే కోలో
పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయ్యింది సిగ్గుతోటి కోలోయమ్మా
కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
హే' పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట
కాలిధూళి బొట్టుపెట్టుకుంటా
కుర్రగాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడిగూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే
తాళిలాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట
వాడి పెదవితోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట
వాడి గొంతుతోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా
కోలు కోలమ్మా కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండినవాడే కనులముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే
Поcмотреть все песни артиста
Other albums by the artist