Prabhu Deva - Nava Manmathuda (From "Pelli Sandadi") lyrics
Artist:
Prabhu Deva
album: 25 Love Telugu Collection
నవమన్మధుడా అతిసుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు
గోరువెచ్చని ఊపిరే వేయి వేణువులూదగా తొలిముద్దు చిందించెనే
వీణ మీటిన తీరుగా ఒళ్ళు ఝల్లని హాయిగా బిగికౌగిలందించెనే
రతిరాగాలే శృతి చేసాడే, జత తాళాలే జతులాడాడే,
తనువంత వింత సంగీతమేదో పలికే
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు
వాడి చూపుల దాడితో వేడి ఆవిరి రేపెనే నిలువెల్ల తారాడెనే
చాటుమాటుల చోటులో ఘాటుకోరికలూపెనే ఒడి చేరి తలవాల్చెనే
జడ లాగాడే కవ్వించాడే, నడుమొంపుల్లో చిటికేశాడే,
అధరాలతోనే శుభలేఖ రాసే మరుడే
చెల్లీ ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు
నవమన్మధుడా, అతిసుందరుడా నువు చూసిన ఆ ఘనుడు
అక్కా ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు
శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నువు వలచిన ఆ ప్రియుడు
Поcмотреть все песни артиста
Other albums by the artist