అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు ♪ నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు ♪ నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు