Rajinikanth - Kadile Kalama lyrics
Artist:
Rajinikanth
album: Pedarayudu
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మా నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా
కన్నీళ్ళలో చెలికాడినే
నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే
కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం
నీ రాణితనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమ నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు
ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
Поcмотреть все песни артиста
Other albums by the artist