Rajinikanth - Chilakamma lyrics
Artist:
Rajinikanth
album: Dalapathi
అరె చిలకమ్మా చిటికెయ్యంట
నువు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట
నీ సరదాలే రేగాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
ఓ రోజా పువ్ మాలే తేరా
నీ చినదాని మెడలో వేయ్ రా
నడిరేయంతా సందడి చేయ్ రా
అహ టక్కరి గాడే అహ ఈ బుల్లోడే
నను కట్టి వేసే మొనగాడే లేడే
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
అరె చిలకమ్మా చిటికెయ్యంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
ఓ రోజా పువ్ మాలే తేరా
♪
చీకు చింత లేదు చిందులేసే ఊరు
పాట ఆటా ఇది ఏందంట
అహ ఊరిలోని వారు ఒక్కటైనారు
నీకు నాకు వరసేనంట
పండగ నేడే మన ఊరికే
ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే
అందరికింక వ్యధ తీరేనే
అహ ఈ పుట కానీరా ఆట పాట
బుల్లెమ్మ నవ్విందంట
మణి ముత్యాలే రాలేనంట
అరె మావయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువ్ నాదేనంట, నీతోనే ఉంటా
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
(జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ)
అరె చిలకమ్మా చిటికెయ్యంట
నువు రాగాలే పాడాలంట
అరె మావయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట
♪
వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా దీపం నీవై వెలగాలంట
అహ చీకటతా పోయే పట్ట పగలాయే, ఏల దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే
నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే, కోరికలన్నీ రేపే తీరెనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
చిట్టెమ్మ నన్నే చూడు
జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగ పూట
మన ముచ్చట్లే సాగాలంట
♪
(బంగారు పరువం పలికే ఈ వేళ గుసగుసలు)
(పడుచు కలలే వాగులై పారెనే మహదానందం)
(చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను)
(ఆదమరిచే మూగమనసులే వెన్నెలని కురిపించేనే)
(మూగమనసులే వెన్నెలని కురిపించేనే)
అరె చిలకమ్మా చిటికెయ్యంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
ఓ రోజా పువ్ మాలే తేరా
అహ నువ్ సయ్యంటే నీ తోడై ఉంటా
నీ కళ్ళలోన నే కాపురముంటా
జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
జాంగు చక్ చచక్కు చక్కు జాంగు చక్క ఛ
అరె చిలకమ్మా చిటికెయ్యంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్ రా
ఓ రోజా పువ్ మాలే తేరా
Поcмотреть все песни артиста
Other albums by the artist