Rajinikanth - Yamunna Thatilo ( Sad ) lyrics
Artist:
Rajinikanth
album: Dalapathi
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే

యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో

పాపం రాధా...
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
Поcмотреть все песни артиста
Other albums by the artist