గువ్వ గూడు చేరె కొంగ కొమ్మ చేరె
అయినా నిదుర రాదే.
దూడే పొదుగు చేరె అవ్వే అరుగు చేరె
అయినా నిదుర రాదే.
పగలంతా పని చేసినా
సూరీడల్లే దుప్పట్లొ దూరేయ్
దిగులంతా కరిగించగా
చందురుడొచ్చి వెన్నెల కురిపించే.
రావే రావె నిదురా.
కలతల్ని దాటుకొని రా.
రావే రావె నిదురా.
కలలన్ని మోసుకొని రా.
దోబూచులాడే మా దొరసాని
దొరికే వరకే నీ వేషాలు కాని
చుక్కల మాటున నక్కావా మా అమృత రాణి
ఎక్కడ దాక్కుని ఉన్నావే అలివేణీ
కంచికి చేరని కథలెన్నో చెబుతా నీకన్నీ
కన్నులు మూసుకొని పడుకోవే అమ్మణీ.
మారం చెల్లదంటు గారం ఒళ్లదంటు
పోవే నిదుర పోవే.
మాయే చల్లుకుంటు హాయే అల్లుకుంటు
రావే నిదుర రావే.
Поcмотреть все песни артиста
Other albums by the artist