Kishore Kumar Hits

Ramya Behara - Vegam (From "The Ghost") lyrics

Artist: Ramya Behara

album: Vegam (From "The Ghost")


నీలి నీలి సంద్రం
నింగిలోని మేఘం
నిన్ను చేరమంది
అంతు లేని వేగం
నిన్ను దాటి పోదే
కంటిపాప చూపే
నీ నీలి కళ్ళు నాకే గాలం వేసే
మథురం నా కథ నీతో ఉండగా
నువ్వే నేనుగా కథలే మారగా
ఎవరూ లేని నన్నే చేరి
ఏ మాయ చేశావో ఓ ఓ
కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా హో
వదలక వదిలే ప్రాయం
కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

నీలో నేనుండిపోనా
నీ వల్లనే నేనంటే నాకు తెలిసే
నీలా నే మారిపోనా
నీ ప్రేమలే నా పైన మంత్రం వేసే
నీతో పయనము సాగే దూరము
నువ్వే స్నేహము నువ్వే ప్రాణము
ఎవరు ఎవరికీ ఏమౌతామో
రాసుంది ఏ రోజో
కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా హో
వదలక వదిలే ప్రాయం
కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

నీలో నే సగమైపోనా
నా గుండెల్లోనా
నిన్నే నేను దాచనీ
నన్నే నీకివ్వ రానా
నీ చేరువలోనే నా పరువం ఇలా కరగనీ
మనసే ఆగదు వయసే ఓడదు
రోజే మారినా ఇష్టం తీరదు
మనమే మనకిలా తోడవుతాములే
నువ్వంటే నేనేగా ఓ ఓ
కదలక కదిలే కాలం
ఆగే ఈ నిమిషం నాతో పాటుగా
నువ్వే ఉంటే తోడుగా హో
వదలక వదిలే ప్రాయం
కోరే ఈ తరుణం ఏదో ప్రేమగా
నీతో ఉంటే చాలుగా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists