నెల్లూరి నెరజాణ నా మనసంతా నీవమ్మ నీతో అందాల రహస్యం ఒకటున్నది నాలోనూ ఉందోయి రహస్యం అది నీతో నేనే చెప్పాలని మదిలోని ఆరారటము నా తోడు నీవుంటే ప్రతి రేయి అవుతుంది అందాల మధుమాసం సిగ్గు మొగ్గలా ముద్దబంతిలో రేకు రేకులో లేఖలే రాసి కంటి రెప్పల ఇంటి లోపల బొమ్మ కట్టి గుర్తులన్నీ దాచెయ్ పూసింది విరబూసింది పూసింది విరబూసింది మన ప్రేమ తోట కౌగిట ఏ చూపు... నీ నీడ ఇకపైన పడకుండా నాలోనే దాచుకోనా వయసే ఎంతనీ, కట్నం ఎంతనీ పెళ్ళిచూపులో ప్రశ్నలే వేసి వయసే లేనిది కన్నె మనసని అదే నీకు కట్నమే ఇస్తాలే రేయనక మరి పగలనక రేయనక మరి పగలనక మన లోకంలోనే కాపురం నెల్లూరి నెరజాణ నా మనసంతా నీవమ్మ నీతో అందాల రహస్యం ఒకటున్నది నాలోనూ ఉందోయి రహస్యం అది నీతో నేనే చెప్పాలని మదిలోని ఆరారటము నా తోడు నీవుంటే ప్రతి రేయి అవుతుంది మధుమాసం అని నీకోసం వేచాను ఇన్నాళ్ళుగా