తరతర తరములైన నీ నామమే
యుగయుగ యుగములైన నీ నామమే
యేసు నీ నామమే
ఉన్నతమైన నీ నామమే
అన్ని నామములకన్న
పైనామం నీదే ననుచు
కీర్తించి కొనియాడెద
యేసురాజ నిన్ను స్తుతియింతును
యేసురాజ నిన్నే ఆరాధింతును
ఆత్మతో నింపుమా
శక్తితో నింపుమా
బలముతో నింపుమా
అగ్నితో నింపుమా
యేసురాజ నిన్ను స్తుతియింతును
యేసురాజ నిన్నే ఆరాధింతును
పరలోకమైన - భూలోకమైన
అసాధ్య మైనది లేని నామం
అధికారులైనా - అధికారలైనా
ప్రతిఒక్కరు కీర్తించే - యేసునామం
మామంచి- కాపరిగా- కాపాడి-రక్షించే
బోలో ఈసుమస్సీ కి జై... జై... జై
యేసురాజ నిన్ను స్తుతియింతును
యేసురాజ నిన్నే ఆరాధింతును
ఆత్మతో నింపుమా
శక్తితో నింపుమా
బలముతో నింపుమా
అగ్నితో నింపుమా
స్వస్థతల నిచ్చే- విడుదల నిచ్చే
సర్వ శక్తిగల యేసు నామం
సమస్యలైనా - సంకెళ్ళనైన
సాంతముగా తొలగించే - యేసునామం
కాపరిగా-కుమ్మరిగా-కాపాడి-రక్షించే
బోలో ఈసుమస్సీ కి జై... జై... జై
యేసురాజ నిన్ను స్తుతియింతును
యేసురాజ నిన్నే ఆరాధింతును
ఆత్మతో నింపుమా
శక్తితో నింపుమా
బలముతో నింపుమా
అగ్నితో నింపుమా
Поcмотреть все песни артиста
Other albums by the artist