చినుకలా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవే సుమా చినుకలా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులురాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నేవేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే ఆ చల్ల నీతోడులే... హిమములా రాలి సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచిపోబోకుమా విరహమైపోకుమా తొలకరి కోపం తొదిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దురావాలిలే నిన్నలు నేడై రేపటి నేదై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే... మౌనమై మెరిసె గానమై పిలిచి కలలతో అలసి గగనమై ఎగసె నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా హా ప్రేమ మనమే సుమా చినుకలా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆహాహా ఆహాహా ఆహాహా... ఆహాహా.