Kishore Kumar Hits

Kalyani Malik - Intinti Ramayanam lyrics

Artist: Kalyani Malik

album: Intinti Ramayanam


మాఇంటికో రామాయణముంతటి
మీఇంటికో రామాయణముంతటి
ఇంటింటికో రామాయణముంతటిగాని
మీఇంట్లో రామాయణం భారతం భాగవతం
అన్నీ mix గొట్టి plex కట్టి ఉన్నాయి
అది మీకోసం ఒక్కొక్క ఏషాన్ని
పట్టుబట్టి బొట్టుపెట్టి పట్టుకొచ్చినా
సూడండ్రి సూసినోళ్ళకి సూసినంత
నవ్వుకున్నోళ్ళకి నవ్వుకున్నంత
ఓరి బామ్మర్ది

ఏ గూన పెంకలిల్లున్నాది
ఓరి బామ్మర్ది
ఇంట్లో సిట్టి సిలకున్నాది
ఓరి బామ్మర్ది
ఇంటి ముందు కాకున్నాది
ఓరి బామ్మర్ది
తినిపోక వస్తుంటాది
ఓరి బామ్మర్ది
నవ్వులు చూడు పువ్వులు చూడు
రింగూ మన్నా loveవులు చూడు
మంది కళ్లు కప్పేసి
గూట్లో పండు గుటుకంతది
అంత ముద్దుగనే ఉన్నది
ఓరి బామ్మర్ది
దాంట్లో ఏదో మతలబున్నది
ఓరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది
ఓరి బామ్మర్ది
పది తలల పంచాయితీది
ఓరి బామ్మర్ది

ఏ ఆగాగాగు
ప్రేమ కధ ఒక్కటే వున్నదనుకునేరు
ఈ ఇంట్లో పిట్టల దొర చెప్పే
కధలకన్నా మస్తు కధలున్నాయి
ఇనుండ్రి
ఆ ఇంటిని నడిపించే గొర్రెను చూడు
గోసి కూరొండేటోడినే నమ్మేస్తాడు
బుడంకాయలాంటి తమ్ముడుంటడు
బుడ్డర్ ఖాన్ లాగా ఎగురు తుంటాడు
ఏ మస్కట్ కే పొయ్యోచ్చిన
బిస్కట్ గాడొకడుంటడు
ఇటున్న పులటెయ్యడు
ఏతుల ఎంకటీడు
ఆవారాగాళ్లు చిల్లరగాళ్లు గత్తరగాళ్లు
ఒకని కోసమొకడు మెడనైనా కోసిస్తారు
ఈ पागल గాళ్లు
ఏ అంత ముద్దుగానే ఉన్నది
ఓరి బామ్మర్ది
అండ్ల ఏదో మతలబున్నది
ఓరి బామ్మర్ది
పంచుకున్న ప్రేమున్నది
ఓరి బామ్మర్ది
పది తలల పంచాయితీది
ఓరి బామ్మర్ది
ఇదంతా విన్ననక ఏదైనా యాదుకొచ్చినాదిల్లా
వీళ్లంతా ఎవలనుకున్నారు
మన బావలు బావమరుదులు
చిన్నవ్వలు చిన్నాయనవసంటోల్లే
ఇదంతా మనకథే ఇంటింటి రామాయణం

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists