Kalyani Malik - Hello Antoo lyrics
Artist:
Kalyani Malik
album: Ashta Chamma
Hello అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి
ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదో ఇచ్చి
వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవా ప్రతాపా
బెదరకే పాపా
వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి
కీడెంచి మేలెంచి
Hello అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరినేమారుస్తాం
ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం
మన్మథ మంత్రం వేద్దాం
రేయిలాంటి మైకం కప్పుకొని ఉందాం
మాయదారి లోకం కంట పడదందాం
మన ఏకాంతం
మనకే సొంతం
అష్ట దిక్కులన్ని దుష్ట శక్తులల్లే కట్టకట్టుకొచ్చి
చుట్టుముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం
ముద్దుల్లో ముంచేద్దాం
ఆరాతీసేవాళ్ళు పారా కాసేవాళ్ళూ దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
పిల్లకి మెళ్ళో పుస్తే కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళొ గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవె చిట్టీ
చంపకు ఊదరగొట్టి
దగ్గిర దగ్గిర ఉండి
తగ్గదు బాదర బంది
ఆవురావురందీ ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అందీ
హ తట్టుకోడమెల్లా
ముట్టుకుంటే డిల్లా
విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూసి కూడా
పస్తులుండమని ఎవ్వరిది శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం
అయినా పెడతా శాపం
Hello అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి
ఎందుకు నీతో పేచి
ఇచ్చేదేదో ఇచ్చి
వచ్చెయ్ నాతో రాజీ
కోలకంటి చూపా కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా తాళవా ప్రతాపా
బెదరకే పాపా వదలని కైపా
నువు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి
కీడెంచి మేలెంచి
Hello అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
Поcмотреть все песни артиста
Other albums by the artist