ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది ♪ ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి ♪ ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయనీ అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి ♪ నీ ఊపిరే వెచ్చగా తగలనీ నా నుదుటిపై తిలకమై వెలగనీ నా చూపులే చల్లగా తాకనీ నీ పెదవిపై నవ్వుగా నిలవనీ ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది