నీ నయనాల ఆ గగనాల సితారకలా ♪ మల్లె మాలికలే రచించే మౌన గీతికలా సన్నజాజులలో సుమించే సందె కోరికలా ♪ ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడ నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా పిల్లగాలులతో ధ్వనించే వేణు గీతికలా ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా ♪ నీ పెదవి దాటే పూల ఋతువేదో ♪ మీటింది నాలో సుఖవీణలే ♪ నీ కనుల దాటే తీపి కల ఏదో రాసింది నాకే శుభలేఖలే ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడ ♪ నా కథలు రాసే నీ కవితలెన్నో ♪ కరిగించె నాలో కనుపాపలే ♪ నీ నడుము దాచే ఊయలలు ఎన్నో ♪ పలికించె నాలో ప్రియజోలలే ♪ ఓ చెలికాడా ఈ చెలికాడా ఇదేం రగడ నా నిను చూడ నీ జత కూడ ఇదేమి దడ తేనె వెన్నెలతో లిఖించే ప్రేమ పత్రికలా ♪ పిల్లగాలులతో ధ్వనించే వేణు గీతికలా ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా ♪ నీ నయనాల ఆ గగనాల సితారకలా