Kishore Kumar Hits

Anup Rubens - Inka Ennaallu - From "Drushyam 2'" lyrics

Artist: Anup Rubens

album: Inka Ennaallu (From "Drushyam 2'")


ఎన్నో కలలు కన్నా
అన్నీ కలతలేనా
చుట్టూ వెలుతురున్నా
నాలో చీకటేనా
ఇంకా ఎన్నాళ్లో కన్నీళ్లు
ఇంకా ఎన్నేళ్లో భయాలు
ఇకపై ముగిసేనా ఏకాంతాలు
పోనే పోదా ఆ జ్ఞాపకం
మళ్లీ రాదా మా సంబరం
ఎన్నో కలలు కన్నా
అన్నీ కలతలేనా
చుట్టూ వెలుతురున్నా

ఏది నిజమో ఏది మాయో
ఏది పగలో ఏది రాత్రో
తెలియకుండా బ్రతుకుతున్నానిలా
అలజడులలో అలసిపోయానిలా
తలుపే మూసి గడుపుతున్నా
మనసే తెరచి వేచి ఉన్నా
ఇంకా ఎన్నాళ్లో కన్నీళ్లు
ఇంకా ఎన్నేళ్లో భయాలు
ఇకపై ముగిసేనా ఏకాంతాలు

కనులు వెనక మునుకు దాచి
అడుగు వెనక బెదురు దాచి
నీడలాగా సాగుతున్నానిలా
నిన్నలోనే ఆగుతున్నానిలా

నాలో నేనే కరుగుతున్నా
నన్నే నేనే అడుగుతున్నా
ఇంకా ఎన్నాళ్లో గాయాలు
ఇంకా ఎన్నేళ్లో గండాలు
ఇకపై కథకెపుడో సుఖాంతాలు

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists