Kishore Kumar Hits

S. Janaki - Vennelarani Kinnerasaani (From "Chakravarthy") lyrics

Artist: S. Janaki

album: Golden Voice Of S.Janaki Hits


వన్నెల రాణి
కిన్నెరసాని
నీ జంట నేనేలే
వెన్నెల రాజా
ఓ నెల రాజా
నా వెంట రావేరా
జంట నువ్వుంటే నీ వెంట నేనుంటా
హద్దులు లేని ముద్దుల కేళికి రా రాణి
గాజులు పాడే మోజుల పాటే కమ్మగ రమ్మను వేళ
కైపుగ దూకే నీ కనుసైగే గుమ్ముగ కమ్మిన గోల
అల్లే ఈ మల్లె గాలి, చల్లే ఈ ముళ్ళ వాడి
ఎలా తప్పించుకోను ఈ అల్లరి
తుళ్ళే పరవళ్ళ వాన, చల్లే వడగళ్ళ వేడి
ఎలా నే తట్టుకోను ఈ ఆరడి
నను నీ ఒడిలో దాగుండనీ
కోరే ఈడును ఓడించనీ
హద్దులు లేని ముద్దుల కేళికి రా రాణి
వన్నెల రాణి
కిన్నెరసాని
నీ జంట నేనేలే
వెన్నెల రాజా
ఓ నెల రాజా
నా వెంట రావేరా
వెన్నెల ఏరై గల గల పారే ఒంగిన వలపుల తల
వెచ్చని ఊహల తీరం కోరే తియ్యని తలపుల అల
కౌగిళ్ళ పందిరెక్కి పాకే ప్రాయాలకి విర పూసే గిలిగింత పూల గంధాలతో
సాగే సయ్యాటలోన ఊగే వయ్యారి ఊహ తాకే నీలాల నింగి ఈ వేళలో
తారలు సిగలో తురమాలని
తీరని తపనలు తరమాలని
హద్దులు లేని ముద్దుల కేళికి రా రాజా
వన్నెల రాణి
కిన్నెరసాని
నీ జంట నేనేలే
వెన్నెల రాజా
ఓ నెల రాజా
నా వెంట రావేరా
జంట నువ్వుంటే నీ వెంట నేనుంటా
హద్దులు లేని ముద్దుల కేళికి రా రాణి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists