తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తియ్యదనం మనసుపడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్లో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలిపటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలోన ఇరుకుండదే ప్రతి మనసులోన చోటుందిలే ఈ నడకకెపుడూ అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడి విడిగా వీళ్ళు పదాలే ఒకటయ్యిన వాక్యమల్లె ఒక తియ్యటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంతానందాన్నే తందానే తందానే తందానే తందానే బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే ఒకటే కలగంటాయంట వీళ్లందరి కళ్ళు అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు