Kishore Kumar Hits

R. Madhavan - Okkarante Okkaru lyrics

Artist: R. Madhavan

album: Savyasachi


ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు
ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు
ఒక తనువున ఎదిగిన కవలలు
ఒక తీరున కదలని తలపులు
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు
ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు
విడి విడి కుడి ఎడమలుగా
కలవనంటు ఎందుకలా
చెరి సగమున కలివిడిగా
ఒదగమంది అమ్మ కల
చెరో చెయ్యి మీదిగా
చెంప నిమిరితే చాలు
మరో వరమె లేదనుకుంటూ
మెరిసిపోవా నా చిరు నవ్వులు
ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు
అన్న వెంట అడవులకేగిన
లక్ష్మణుడే ఆదర్శం
అరమరికలు దాటి సాగితే
అడుగడుగు మధుమాసం
నా కలలకు రెక్కలు మీరు
నా ఎనిమిది దిక్కులు మీరు
సంబరాల మీ సహవాసమె
నే కోరిన సంతోషం
మీ ఇద్దరి ఒద్దిక చూస్తూ
గడవాలి నా ప్రతి నిమిషం
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకదే పదివేలు
ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు
ఒక్కరంటె ఒక్కరు
ఇద్దరంటె ఇద్దరు

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists