Kishore Kumar Hits

R. Madhavan - Ningiki Jabili Andam lyrics

Artist: R. Madhavan

album: Cheli (Original Motion Picture Soundtrack)


నింగికి జాబిలీ అందం నేలకు తొలకరి అందం
నీ కనుచూపులు సోకడమే ఆనందం.
ఆనందం. ఆనందం
బొమ్మాబొరుసుల చందం విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమీ అనుబంధం.
అనుబంధం. అనుబంధం
ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా
ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా
ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా
వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి అడకే దీవాలి చెవిలో పాడకే కవ్వాలి
మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరు
నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవారే
వారెవరో వారెవరో వచ్చినదెందుకనో ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో
ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే
అరే ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా
ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా అరె తికమక పడుతున్నా
సొగసరిగువ్వా సొగసరిగువ్వా తడబాటెందులకే వలపుల దాహం తీర్చవటే
మనసున మోహం కమ్ముకువస్తే మౌనం వీడవటే మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్ను ఏదో చేశావులే
నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చేశావే బొమ్మా
నీవెవరో నీవెవరో వచ్చినదెందుకనో నా వెనకే పడ్డావు.
నేనేలే నీకోసం వచ్చా మనసారా నా ఎదనే నీకోసం పరిచా ప్రియమారా
ఏమైందో నాకే తెలియదులే నా మనసు నిన్నే వీడదులే
అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనే ప్రాణసఖీ
ఇది వలపుకథో వయసువ్యధో తెలుపవే చంద్రముఖీ
కథ తెలుపవే చంద్రముఖీ. కథ తెలుపవే చంద్రముఖీ.
కథ తెలుపవే చంద్రముఖీ.
చంద్రముఖీ.చంద్రముఖీ.చంద్రముఖీ.

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists