Kishore Kumar Hits

Bharani - Mama Yem Mana lyrics

Artist: Bharani

album: Yes Madam (Original Motion Picture Soundtrack)


మన జన్మభూమి. బంగారు భూమి
పాడి పంటలతో. పసిడి రాశులతో.
కళ కళలాడే జననీ... మన జన్మభూమి
మన జన్మభూమి. బంగారు భూమి
పాడి పంటలతో. పసిడి రాశులతో. కళ కళలాడే జననీ... మన జన్మభూమి
మనజన్మ భూమి.
రైతు లేనిదే. రాజ్యం లేదని
రైతు లేనిదే. రాజ్యం లేదని
ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే
నీలాకాశం నుదుటిన తిలకం
నిండుగా దిద్దుకుంటుంది
రైతు పాదమే. రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే.
హే... హే.ఆ.ఆ.ఆ
రైతు పాదమే. రామ పాదమని
పిల్లగాలులు పాడినంతనే.
అణువు అణువు అన్నపూర్ణయై
ప్రేమతో పులకరిస్తుంది
మమతల మాగాణి... మనజననీ.
మన జన్మభూమి. బంగారు భూమి
పాడి పంటలతో. పసిడి రాశులతో కళ కళలాడే జననీ. మన జన్మభూమి
మనజన్మ భూమి. మనజన్మ భూమి.
నాగలితో నమస్కరించి. పారలతో ప్రణమిల్లి
నాగలితో నమస్కరించి. పారలతో ప్రణమిల్లి
గుండె గుప్పెట పట్టి. గుప్పెడు ధాన్యం చల్లితే
గంగ యమున గోదావరి కృష్ణలె పాలపొంగులై ప్రవహించి
కుప్పతెప్పలుగా పురులు పొర్లగా
ప్రాణం పంటగా ప్రసవించే. జననీ
పచ్చి బాలింతరాలు. మన జననీ
మన జన్మభూమి. బంగారు భూమి
పాడి పంటలతో. పసిడి రాశులతో. కళ కళలాడే జననీ... మన జన్మభూమి
మనజన్మ భూమి. మనజన్మ భూమి...
నల్లని రాముని. అల్లరి కృష్టుని...
నల్లని రాముని. అల్లరి కృష్టుని... పాదాలతో
చల్లబడిన నల్లరేగడ భూమి
బోసు. భగత్ సింగ్. బాపు. నెహ్రు. త్యాగాలతో
ఊపిరి పీల్చిన భూమి
అల్లూరి సీతారామరాజు రక్తంతో. వీర రక్తంతో
తడిసి తరించి. రత్నగర్భగా
రాళ్ళకెక్కిన జనని. రతనాలకన్న జననీ
భాష ఏదైనా. వేషమేదైనా
భారతీయులు ఒకటేనంటు
బిడ్డలందరికి ఒకే బావుటా
నీడగ నిచ్చిన. జననీ
విశ్వ నివాళులందిన. జననీ
మాతలకు మాత. మన భరతమాత
మన జన్మభూమి. బంగారు భూమి
పాడి పంటలతో పసిడిరాశులతో కళ కళలాడే జననీ
మన జన్మభూమి... మన జన్మభూమి

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists