ఏవో గుసగుసలే నాలో
వలసే విడిసి వలపే విరిసే ఎదలో
ఎయ్ పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టుపై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే (వే వే వే)
కొడవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)
ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే
విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటె బాణాలు
గడ్డిపరకపై అగ్గిపుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటె మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనెపట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తె మల్లె తీగ
నా మనసు దానినల్లే తూనీగ
మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా
హే పిల్లా నా గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే (వే వే)
హేయ్ పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టుపై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే
పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే (వే వే వే)
ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే (వే వే వే)
Поcмотреть все песни артиста
Other albums by the artist